Monday, December 23, 2024

వాచ్ దొంగతనం?… చితకబాదిన టీచర్లు… విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

Student dead over teacher beating

లక్నో: తొమ్మిదో తరగతి విద్యార్థి వాచ్ దొంగతనం చేశాడనే అనుమానంతో ముగ్గురు టీచర్లు చితకబాదడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి ప్రాంతంలోని కసవ గ్రామంలో జహంగీర్‌కు దిల్షాన్ అనే కుమారుడు ఉన్నాడు. దిల్షాన్ స్థానిక స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. తొటి విద్యార్థి వాచ్ దిల్షానా బ్యాగ్‌లో దొరకడంతో అతడే తీశాడనుకున్నారు. ముగ్గురు పంతుళ్లు గదిలోకి అతడిని తీసుకెళ్లి చితకబాదడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News