- Advertisement -
కామారెడ్డి: పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి(14) అనే విద్యార్థిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. గురువారం ఉదయం ఇంటి వద్ద బ్రేక్‌పాస్ట్ చేయకుండా స్కూల్‌కు వెళ్లింది. మార్గం మధ్యలో కుప్పకూలిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిపిఆర్ చేసే ఆమెను రక్షించడానికి వైద్యుల ప్రయత్నించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. సిపిఆర్ చేస్తుండగా సదరు విద్యార్థిని తుది శ్వాస విడిచిందని వైద్యులు వెల్లడించారు.
- Advertisement -