Sunday, February 23, 2025

పరీక్షకు ఆలస్యం…విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదిలాబాద్ లో విషాధకర సంఘటన చోటుచేసుకుంది. జైనథ మందలం మంగుర్ల గ్రామానికి చెందిన విద్యార్థి శివ పరీక్ష రాయడానికి అనుమతించకపోవడంతో సత్నాల ప్రాజెక్టు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 14 ఏళ్ల అతడు టిఎస్ఎస్ డబ్య్లుఆర్ జూనియర్ కాలేజ్ లో  ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. కాగా అతడు పరీక్ష హాలుకు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్యకు తెగించాడు. ప్రాజెక్టు వద్ద అతడు తన తండ్రికి ప్రాణాలు తీసుకుంటున్నందుకు క్షమించమంటూ రాసిన లేఖ దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశోధన చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News