Friday, December 20, 2024

అనారోగ్యంతో విద్యార్ధి మృతి

- Advertisement -
- Advertisement -

నెన్నెల: మండల కేంద్రానికి చెందిన టాగూర్ సృజన్ సింగ్ (15) విద్యార్ది అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానిక జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో 9వ తరగతి విద్యార్ధి సాంఘీక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న విద్యార్ధి సోమవారం అనారోగ్యానికి గురి కావడంతో అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ సరియైన చికిత్స లభించకపోవడంతో హైదరాబాద్ తరలిం చారు. హైదరాబాద్ ఆసుపత్రిలో విద్యార్ధికి పచ్చలు, పలు రకాల ఆరోగ్య సమస్యలు వల్ల ఆరోగ్య పరిస్దితి క్షీనించి విషమించిం దని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని తండ్రి గోపాల్‌సింగ్ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం స్థానిక పాఠశాల ప్రధానోపాద్యాయులు నారాయణ, ఉపాధ్యాయులు గోపాల్, చిన్నయ్య, వెంకటేశ్వర్లు, భారతి, శ్రీరాములు, వాసం రాజమల్లు, పలువురు ఉపాధ్యాయులు విద్యార్ది తల్లిదండ్రులను పరామర్శించారు. మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి ఇబ్రహీం, పలువురు నాయకులు పరామర్శించారు. కాగా విద్యార్ది మృతి పట్ల ఉపాధ్యాయులు, విద్యార్దులు రెండు నిమిషాలు మౌనం పాటించి పాఠశాలకు సెలవు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News