Tuesday, September 17, 2024

పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఒకరిని మెట్‌పల్లి, మరొకరిని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆర్‌డిఒ శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్‌డిఒ శ్రీనివాస్ సేకరిస్తున్నారు. గురువారం రాత్రి గురుకుల హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి గణాదిత్య పడుకున్న తరువాత అర్థరాత్రి కడుపులో నొప్పిగా ఉందని వాంతులు చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వడంతో బాలుడిని బైక్ పై ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. మృతి చెందిన విద్యార్థి మెట్‌పల్లిలో అరపేటకు చెందిన బాలుడు అని ఉపాధ్యాయులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు ఆహారం రూపంలో ఉన్న విషాన్ని అందిస్తుండడంతో వారు అస్వస్థతకు గురవుతున్నారని మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా విషపూరతమైన ఆహారం తిని పలు గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News