Wednesday, January 22, 2025

కొంపల్లిలో ప్రైవేటు స్కూల్ హాస్టల్‌లో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం రాత్రి 7వ తరగతి విద్యార్ధి మల్లికార్జున్ భోజనం చేసి నిద్రపోయాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. మల్లికార్జున్ మృతిచెందినట్లు వైద్యుల నిర్ధారించారు. హాస్టల్‌ వార్డెన్ పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలుడు గుండెపోటుతో చనిపోయి ఉంటాడని స్కూల్ సిబ్బంది తెలిపారు. సదరు ప్రైవేటు స్కూల్ యాజమాన్య వైఖరిపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News