Tuesday, January 21, 2025

నిర్లక్ష్యానికి.. నిండుప్రాణం..!

- Advertisement -
- Advertisement -

నిర్లక్ష్యానికి.. నిండుప్రాణం..!
చెత్త తొలగించేందుకు బావిలో దిగిన విద్యార్థి మృతి
సేయింట్ ఆంథోనిస్ పాఠశాలలో ఘటన
స్కూల్ యాజమాన్యం నిర్లక్షమే కారణమంటూ తల్లిదండ్రుల ఫైర్
విద్యార్థి మృతదేహంతో పాఠశాల ఆవరణలో ధర్నా
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని సేయింట్ ఆంథోనిస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్షం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి బావిలో పేరుకున్న చెత్తను తొలగించేందుకు దిగిన ఓ విద్యార్థి నీటమునిగి చనిపోవడం స్థానికులను కలచివేసింది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన మారం శ్రీకర్ (15) సేయింట్ ఆంథోనిస్ పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్ వార్డెన్ పక్కనే ఉన్న బావిలో చెత్తచెదారాన్ని తొలగించాలంటూ విద్యార్థులను బావిలోకి దిగమన్నాడు. దీంతో హాస్టల్‌లో ఉంటున్న నలుగురైదుగురు విద్యార్థులతో పాటు శ్రీకర్ బావిలోకి దిగాడు. మిగతా విద్యార్థుల్లాగా శ్రీకర్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంటకు పైగా శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీశారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న ఎల్‌ఎండీ ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి పాఠశాలకు చేరుకొని, విద్యార్థి మృతదేహంతో పాటు బావిని పరిశీలించారు.

మృతదేహంతో ధర్నా..
విద్యార్థి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు పాఠశాలకు చేరుకోని మృతదేహం వద్ద బోరున విలపించారు. తమ అబ్బాయి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవలంటూ మృతదేహంతో ధర్నాకు దిగారు. కాగా విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంతో పాటు హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులతో పాటు స్థానికులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News