Tuesday, January 21, 2025

విద్యార్థిని అదృశ్యం.. విషాదాంతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జవహర్‌నగర్ : నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన విషాదాంతంగా మారిందది. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని ఇందు కనిపించకపోవడంతో కిడ్నాప్ జరిగిందా లేక విద్యార్థి ఎటైన వెళ్లిపోయిందా అనే విషయంలో తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ధమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. గురువారం ఉదయం చిన్నారిని తండ్రి నరేష్ దమ్మాయిగూడ లోని ప్రభుత్వ పాఠశాలలో వదిలివెళ్ళిన తర్వాత అదృశ్యమైనట్లు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన జవహర్ నగర్ పోలీసులు. పాప చివరి సారిగా చెరువు వైపు వెళ్లినట్టు సీసీ టీవీ లో రికార్డ్ అయ్యింది. చెరువులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి చిన్నారి ఇందు మృతదేహాన్ని వెలికి తీసిన జవహర్ నగర్ పోలీసులు. బాలిక ప్రమాదవషాత్తు చెరువులో పడిందా, లేక ఎవరైన ఈ దారుణానికి పాల్పడ్డారా అని తల్లిదండ్రులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News