Sunday, December 22, 2024

భువనగిరిలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఏప్రిల్ 12వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భువనగిరి ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార రెడ్డి చొరవ తీసుకొని జూబ్లీహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. మృతుడు పోచంపల్లి మండలం జబ్లక్ పల్లికి చెందిన విద్యార్థి అని అధికారులు తెలిపారు. ప్రశాంత్ ఆరో తరగతి చదవుతున్నాడు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రశాంత్ మృతితో జబ్లక్‌పల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News