Monday, December 23, 2024

ఎస్ఆర్ఎస్ పి కాల్వలో పడి విద్యార్థి గల్లంతు..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : ఎస్ఆర్ఎస్ సి కాల్వలో పడి విద్యార్థి గల్లంతైన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఖిల్లా గడ్డ ప్రాంతానికి చెందిన కండ్లపెళ్లి ఆయూష్ (15) అనే పదవ తరగతి చదువుతన్నాడు. జనవరి 1 కావడంతో విద్యార్థి ఆదివారం సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా, బహిర్భుమికి వెళ్లి కాల్వలోకి దిగాడు.

దీంతో ఆయూష్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టినా ఆయూష్ జాడ దొరకలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గజ ఈతగాళ్ల సహయంతో విద్యార్థిని వెతకడం ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News