Monday, December 23, 2024

కాలువలో స్కూల్ బస్సు బోల్తాపడి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

బిజ్నోర్ (యుపి): సదఫల్ గ్రామానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు బుధవారం కాలువలో పడి 8 ఏళ్ల విద్యార్థి మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. స్కూల్ తరగతులు ముగియగానే విద్యార్థులను తిరిగి ఇళ్లకు చేర్చడానికి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. అలియార్‌పూర్ వద్ద రోడ్డుపై పడిన గుంతను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌పి నీరజ్‌కుమార్ చెప్పారు. కాలువలో నీళ్లు లేవు. ఈ సంఘటన గురించి తెలియగానే స్థానిక గ్రామస్థులు, పోలీస్‌లు సంఘటన ప్రదేశానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బస్సులో ప్రైమరీ స్కూలుకు చెందిన 20 మంది ఉన్నారు. క్రేన్ సాయంతో కాలువ లోంచి బస్సును బయటకు తీయగలిగారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News