Monday, December 23, 2024

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని మృతి…

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని మృతిచెందింది. బాత్రూమ్ లో అపస్మారక స్థితిలో విద్యార్థిని పడిపోయింది. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థిని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని అప్పటికే చనిపోయిందని భైంసా వైద్యులు వెల్లడించారు. ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని దీపిక పియూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం దీపిక ఫిజిక్స్ పరీక్ష రాసినట్లు సమాచారం. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News