Monday, April 7, 2025

ప్రసంగిస్తూ 20 ఏళ్ల విద్యార్థినికి గుండెపోటు.. మృతి

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద అని వయస్సుతో సంబంధం లేకుండా పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో కొంతమంది అయితే.. అతి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడుస్తున్నారు. ఇలా ఓ దుర్ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ధారశివ్ జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఫేర్‌వెల్ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా వర్ష కారత్ అనే విద్యార్థిని ప్రసంగించింది.

కళాశాలతో తనకున్న అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇలా మాట్లాడుతూనే ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్నవాళ్లు స్పందించి వర్షను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే వర్ష గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని 12 ఏళ్ల తర్వాత గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News