Wednesday, January 22, 2025

చదువు ఇష్టంలేక విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలం వేల్ఫుగొండకు చెందిన విద్యార్థిని కావ్య (17)ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, కుటంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..సదాశివనగర్ మండలం మర్కల్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో కావ్య డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది . ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో కళాశాలకు వెళ్లాలని కావ్య తో  తల్లిదండ్రులు  అన్నారు. ఈ క్రమంలో తనకు చదువు అర్థం కావడం లేదని కళాశాలకు వెళ్లనని కావ్య తల్లిదండ్రులతో చెప్పింది.

రోజువారు పనిగా  తల్లిదండ్రులు చేనుకు వెళ్ళగా కావ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తల్లిదండ్రులు పని ముగించుకొని ఇంటికి రాగా కావ్య దూలానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు వర్ణనీతీతం.ఈ ఘటన గురించి స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News