Thursday, January 23, 2025

డైట్ ఛార్జీలు పెంపు

- Advertisement -
- Advertisement -

26% పెంచుతూ ఫైల్‌పై సిఎం సంతకం
జులై నుంచే అమలు.. 7.50 లక్షల మంది అన్ని స్థాయిల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చేకూరనున్న ప్రయోజనం
ఖజానాపై అదనంగా రూ.237కోట్ల భారం
విద్యార్థుల సంక్షేమానికి ఎంతైనా
ఖర్చు చేస్తాం: ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ : రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్ల లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు మరిం త నాణ్యమైన భోజనం వసతులను అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్ ఛార్జీలను పెంచుతూ సంబంధిత ఫైల్ మీద శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్‌లో సిఎం కెసిఆర్ సంతకం చేశారు. పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి రానున్నాయి. కాగా.. డైట్ ఛార్జీల పెరుగుదల కోసం సిఎం కెసిఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సిఎం కెసిఆర్‌కు సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. రాష్ట్రంలో పెరిగిన డైట్ చార్జీల ద్వారా… ట్రైబల్ వెల్ఫే ర్, ఎస్‌సి వెల్ఫేర్, బిసి వెల్ఫేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సిఎం తెలిపారు. ప్రస్థుతం అందిస్తున్న ఛార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి.

దీనితో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నది. ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించుదుకు అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం స్పష్టం చేశారు. డైట్ చార్జీలు పెంచుతూ ఫైలు పై సంతకం చేసిన సందర్భంగా గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం కెసిఆర్‌కు కృతజ్జతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News