Wednesday, January 22, 2025

టీచర్ కొట్టిందని.. వికారాబాద్ జిల్లాలో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ లో శనివారం విద్యార్థి మృతి చెందాడు. ఉపాధ్యాయురాలు కొట్టడంతో సాత్విక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మంత్రి సబిత ఇంద్రరెడ్డి విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ కు మంత్రి ఆదేశాలు జారీచేశారు. బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News