Thursday, January 23, 2025

అశ్లీల వీడియోలతో ప్రొఫెసర్ బెదిరింపు…. విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Student ends life after professor threatens him with obscene video

 

ఛండీగఢ్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రొఫెసర్ బెదిరించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని ఫతేబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జతీన్ కుమార్ అనే విద్యార్థి బికామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో వషీమ్ ఖాన్, సవితా పాత్ర అనే వ్యక్తులు ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. జతీన్‌కు సంబంధించిన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో పాటు 13 వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అతడు తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి 13 వేల రూపాయలు బదులుగా తీసుకొని ఫోన్ పే ద్వారా వషీమ్ ఖాన్‌కు పంపించాడు. మళ్లీ ఫోన్ చేసి 18000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్య శరణ్యమని అతడు భావించాడు. వెంటనే సర్దార్ వాలా గ్రామ శివారులోని భాక్రా కెనాల్ లో దూకి జతీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జతీన్ కుమార్ తల్లిదండ్రులు తన కుమారుడు కనిపించడంలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భాక్రా కాలువలో మృతదేహం కనిపించడంతో జతీన్‌దిగా గుర్తించారు. అతడి వాట్సాప్ సందేశాల ఆధారంగా నిందితులు వషీమ్, సవితా పాత్రాగా గుర్తించి వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News