Sunday, January 19, 2025

పాము కాటుకు విద్యార్థి లావణ్య మృతి..

- Advertisement -
- Advertisement -

పెద్దమందడి: మండల పరిధిలోని చిన్నమందడి గ్రామంలో ఆదివారం బోయ లావణ్య (11) విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి బోయ సత్యం, భార్య పుష్ప వివరా ప్రకారం ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వ్యవసాయపొలానికి రావడంతో సాయంకాలం పాము కాటుకు గురైనట్లు వారు తెలిపారు. ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. అదే గ్రామంలో పాఠశాలలో 5వ తరగతి చదివినట్లు వారు తెలిపారు.

సోమవారం ఎంపిపి మేఘారెడ్డి విషయం తెలుసుకున్నాక ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. స్థానిక వనపర్తి గొర్రెల డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, స్థానిక సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, గ్రామ నాయకులు పరామర్శించారు. మొన్న జరిగిన స్వయం పరిపాలన దినోత్సవంలో ఉపాధ్యాయురాలు పాల్గొని ఒక రోజు తోటి విద్యార్థులకు పాఠాలను బోధించినట్లు తెలిపారు. గ్రామంలో కన్నీటి వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News