Monday, December 23, 2024

గురుకుల విద్యార్థినీ ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Student ends life by fell on railway tracks in Shadnagar

రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పట్టణంలో రైలు పట్టాలపై పడి గాయత్రి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి.. షాద్ నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో పదవ తరగతి చదువుతుంది. గాయత్రి ఆదివారం తన తల్లితండ్రుల సమక్షంలో కల్వకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ లో జూనియర్ కళాశాలకు సంబంధించి పరీక్షలు రాయడానికి వెళ్ళింది. తర్వాత కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. అయితే, ఈరోజు ఉదయం షాద్ నగర్ పట్టణంలోని రైలు పట్టాలపై గాయత్రి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాయత్రిది ఆత్మహత్య? లేక హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Student ends life by fell on railway tracks in Shadnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News