Monday, December 23, 2024

చదువు ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కాసిపేటః చదువుకోవడం ఇష్టం లేక పెంద్రం అంకిత (16) అనే విద్యార్ధిని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుండ్లపాడ్ గ్రామంలో విషాదం నెలకొల్పింది. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిదిలోని ముత్యంపల్లి గ్రామ పంచాయితీ గుండ్లపాడ్ గ్రామానికి చెందిన పెంద్రం కిషన్ కూతురు పెంద్రం అంకిత ఆసిఫాబాద్‌లో ఎస్‌టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. గత నెల అంకితకు జ్వరం రావడంతో ఉపాద్యాయులు తెలుపడంతో కుటింబీకులు వెళ్లి అంకితను తీసుకొని వచ్చినట్లు తెలిపారు. సంక్రాంతి పండగ సెలవులు ఉండడంతో అంకిత గుండ్లపాడ్ గ్రామంలోనే ఉంది.

ఆశ్రమ పాఠశాల ప్రారంభం కావడంతో అంకితను పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు కోరడంతో రేపు, మాపు అంటు వస్తోందని సోమవారం పాఠశాలకు వెళ్తానని ఆదివారమే బ్యాగు కూడా సర్దుకుందని ఆమె తండ్రి కిషన్ తెలిపారు. రాత్రి తమతో పాటు భోజనం చేసి తమ తోనే నిద్రించిందని ఆయన తెలిపారు. తనకు తెల్లవారు జామున మెలుకువ రావడంతో ప్రక్కన చూసే సరికి అంకిత లేదని, ఇంట్లో చూడగా ముందు గదిలో దూలానికి ప్లాస్టిక్ త్రాడుతో ఉరి వేసుకొని ఉందని వెంటనే క్రిందకు దించినప్పటికి అప్పటికే చనిపోయిందని ఆయన తెలిపారు. కాసిపేట ఎఎస్‌ఐ బూర రవీందర్ సంఘటన స్థలంలో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి పెంద్రం కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్మాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్‌ఐ గంగారాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News