Sunday, December 22, 2024

బడికి పొమ్మంటే..కాటికి వెళ్లింది

- Advertisement -
- Advertisement -

కొత్తగూడ: ఎన్నో ఆశలతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నందనుకున్న తమ కూతురు తమకు అండగా ఉంటుందను కుంటే చదువుకోవాలని చిన్న మందలింపుతో మనస్తాపం చెంది ఇలా చేస్తుందను కోలేదంటూ కన్న తల్లిదండ్రులు కన్వీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన జుర్రు రేణుక 9వ తరగతి చదువుతుంది.

కాగా రేణుక చదువుకోకుండా ఎప్పుడూ ఖాళీగా ఉండటంతో తల్లి రేణుకను చదువుకోమంటూ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రేణుక ఈనెల 1న పురుగుల మందు తాగింది. వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కాగా రేణుక మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News