Sunday, December 22, 2024

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మెడికల్ కాలేజీ హాస్టల్‌లో మూడవ అంతస్తులో తన గదిల్లోనే ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎం. సనంత్ (21) నిజామాబాద్ మెడికల్ కాలేజిలో 2020 సంవత్సరం ఎంబిబిఎస్‌లో అడ్మిషన్ పొందారు.

థర్డ్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి ప్రాక్టికల్ పరీక్షల కోసం సిద్దమవుతున్న సనత్ ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు తెలియరావడం లేదు. శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ యేడాది జనవరిలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి దాసరి హర్ష సైతం హాస్టల్ గదిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News