Monday, December 23, 2024

గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన్ననూర్ ః నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని నాగిళ్ళ నిఖిత(13) తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన బుచ్చిరాములు కుమార్తె నాగిళ్ళ నిఖిత మన్ననూర్‌లోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. ఇదిలా ఉండగా విద్యార్థిని ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్లాస్ టీచర్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి పోలీస్ విచారణ జరిగితే తప్ప ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి అవుతాయి. అమ్రాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
నిఖిత ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకుని మన్ననూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చేరుకున్న నిఖిత తల్లిదండ్రులు తమ కూతురిని చూసి రోదించారు. పెద్ద సంఖ్యలో బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News