Monday, April 7, 2025

క్రికెట్ ఆడుతూ మృతి… సిఎంఆర్ కాలేజీలో విషాదం

- Advertisement -
- Advertisement -

ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏప్రిల్ 4న సిఎంఆర్ కాలేజీలో నిర్వహించిన టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతూ.. వినయ్ ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు రావడంతోనే అతని మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో కళ్ల ముందే తమ స్నేహితుడు మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News