Sunday, December 22, 2024

యువకుల వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వేధింపులు తాళలేక విద్యార్థిని పురుగుల మందుల తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం, మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజిత దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. కూతురు కళ్యాణిని (18) అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు గత కొంతకాలంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలను స్టేటస్‌గా పోస్ట్ చేస్తామని వేధింపులకు గురిచేసేవారు.

ఈ వేధింపులు భరించలేక కళ్యాణి ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తమ ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి కొత్త రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగులపల్లి ఎస్‌ఐ జి.శోభన్ తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News