Monday, December 23, 2024

టీచర్లను కత్తితో బెదిరించిన విద్యార్థిని తండ్రి

- Advertisement -
- Advertisement -

Student father sword and threatened teachers

స్కూలుకు రానివ్వలేదని ఆగ్రహం

అరారియా(బీహార్): తన కుమార్తెకు స్కూలు యూనిఫామ్ కొనడానికి దబ్బులు లేకపోవడంతో ఒక తండ్రి స్కూలులోకి చొరబడి టీచర్లను కత్తితో బెదిరించాడు. బీహార్‌లోని అరారియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. యూనిఫామ్ ధరించలేదన్న కారణంతో తన కుమార్తెను స్కూలులోకి రానివ్వనందుకు ఆగ్రహించిన అకర్ అనే వ్యక్తి నేరుగా స్కూలుకే వెళ్లి అక్కడి టీచర్లను కత్తి చూపి బెదిరించాడని జోకిహట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అతను తన కుమార్తెకు స్కూలు యూనిఫామ్ కొనివ్వలేకపోయాడని ఆయన తెలిపారు. యూనిఫామ్ కొనడానికి సరిపడా డబ్బులు తనకు దొరకకపోతే మళ్లీ 24 గంటల్లో స్కూలుకు వస్తానని కూడా అతను హెచ్చరించాడని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. స్కూలు హెడ్‌మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News