భువనేశ్వర్: సీనియర్ల వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థి వాళ్ల నుంచి తప్పించుకునేందుకు రెండో అంతస్థు నుంచి కిందకు దూకిన సంఘటన అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగింది. తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ శర్మ అనే విద్యార్థి దిబ్రూగడ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. శర్మను సీనియర్లు వేధించిడంతో అతడు తట్టుకోలేకపోయాడు. సీనియర్ల నుంచి తప్పించుకోవడానికి రెండో అంతస్థు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తన కుమారుడి వద్ద సెల్‌ఫోన్, డబ్బులు గుంజుకొని వేధించేవారని పోలీస్‌స్టేషన్‌లో శర్మ తల్లి ఫిర్యాదు చేసింది. శర్మకు మద్యం తాగించి, అర్థనగ్నంగా నిలబెట్టి ఫోటోలు తీసేవారని, వాటిని సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.రోజు రోజుకు కాలేజీల్లో ర్యాగింగ్ శృతి మించుతోంది. ర్యాగింగ్‌కు విద్యార్థులు బలవుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నర్యాగింగ్ భూతం మాత్రం ఆగడంలేదు.
సీనియర్ల వేధింపులు… రెండో అంతస్థు నుంచి దూకిన విద్యార్థి
- Advertisement -
- Advertisement -
- Advertisement -