- Advertisement -
కళబురగి: స్కూల్‌లో ఏడేళ్ల బాలిక వేడి వేడి సాంబర్‌లో పడి మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం కళబురగి జిల్లాలో అఫ్జల్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. చిన్నమెగర గ్రామంలో మహంతమ్మ శివప్ప అనే బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. నవంబర్ 16న పిల్లలతో ఆడకుంటుండగా వెళ్లి మిడ్ డే మిల్ సాంబారు గిన్నెలో పడింది. వెంటనే బాలిక బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడడంతో కలబురగి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. స్కూల్ హెడ్మాస్టర్ లలబి నదఫ్ సెలవులో ఉండడంతో రాజు చవన్ అనే టీచర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడంతో అతడిని సస్పెండ్ చేశారు. మిడ్ డే మిల్ ఇంఛార్జ్ ను కూడా సస్పెండ్ చేశారు.
- Advertisement -