Thursday, January 23, 2025

ఇండోర్‌లో హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న పునీత్ తూబే అనే విద్యార్థి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇండోర్‌లో రంజిత్ సింగ్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పునీత్ స్వస్థలం ఉదయ్‌పుర. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం గత రెండేళ్ల నుంచి ఇండోర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి పునీత్ చనిపోయాడు. హాస్టల్ గదిలో తలుపు గడియ పెట్టుకొని ఉన్నాడు. తర్వాత చుట్టుపక్కల వారికి వాసన రావడంతో పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా పునీత్ విగత జీవిగా కనిపించాడు.

చీర కట్టుకొని మేకప్ వేసుకొని, చేతులకు గాజులు వేసుకుని కనిపించాడు. కళ్లకు గంతలు కూడా కట్టుకున్నాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పోలీస్‌లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రతిరోజూ రాత్రి పునీత తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేవాడని, శుక్రవారం ఫోన్ స్విచాఫ్ ఉండటంతో ఆ మరునాడు ఇండోర్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు తల్లిదండ్రులు తెలియజేశారు. పునీత్ ల్యాప్ టాప్, మొబైల్ సీజ్ చేశారు. పునీత్ హాస్టల్ రూమ్ మేట్స్‌ను విచారిస్తున్నారు. పోస్టుమార్టమ్ తరువాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News