Monday, January 20, 2025

ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని…. మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాణ్యం శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్ లో చేరింది. కాలేజీకి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. రాత్రి 9 గంటలకు బాత్రూమ్ లో సదరు విద్యార్థిని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆమెను ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువగా మెరుగైన చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజీ యజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News