Monday, December 23, 2024

నేను ఏ తప్పు చేయలేదు..నా శవం కూడా దొరకదు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: చదవు ఇష్టం లేక యువతి ఇంటి నుండి వెళ్లినపోయిన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం బోరునర్సాపురం లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. బోరు నర్సాపురం గ్రామానికి చెందిన జనగాం కృష్ణ ద్వితీయ కూమార్తె కల్యాణి వరంగల్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుకోవడం ఇష్టం లేక గత వారం రోజులుగా ఇంటి వద్దనే ఉంటుంది కల్యాణి. ఈ క్రమంలో తల్లిదండ్రులు కాలేజికి వెళ్లమని కోరగా తనకు చదువు రాదని, చదువుకోవడం ఇష్టం లేదని తెలిపింది. తన తోటి విద్యార్థులు, చుట్టు పక్కల బంధువులు తనకు చదువు రాదని అనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కల్యాణి ఈ నెల 15న ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా కల్యాణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకకగా ఇంట్లో ఓ లెటర్ కనిపించింది.

ఈ చదువులు తన వల్ల కావడం లేదని.. తన వల్ల ఏమీ కావడం లేదని అందరూ అంటున్నారని ఆ లెటర్‌లో పేర్కొంది. అందరూ ఎన్ని మాటలు అన్నా కూడా తనకు చదువు రావడం లేదని, తాను ఎవరినీ ప్రేమించలేదని, ఏ తప్పు చేయలేదని పేర్కొంది. తల్లిదండ్రులకు సమస్యగా మారవద్దనే ఉద్దేశంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని పేర్కొంది. దూరంగా వెళ్లిపోతున్నా.. నా శవం కూడా దొరకదని, నాకోసం ఎవరు వెతక వద్దని లెటర్ లో రాసింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు కల్యాణి ని వెతకడం ప్రారంభించారు. కాగా కనిపించకుండా పోయిన కల్యాణి ఆచూకీ తెలిస్తే ఎస్ఐ సెల్‌ 9440795241, రైటర్‌ సెల్‌ 738293503 నంబర్లకు అందించాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News