Sunday, January 19, 2025

కోటాలో మరో నీట్ అభ్యర్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

జేబులో రూ. 8000 నగదుతో రాజస్థాన్ కోటాలోని తన పిజి గదిలో నుంచి ఒక నీట్ అభ్యర్థి వెళ్లిపోయిన సుమారు వారం తరువాత వైద్యపరీక్ష కోసం సన్నద్ధం అవుతున్న మరొక 19 ఏళ్ల అభ్యర్థి అదృశ్యమయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా కోటా శిక్షణ కేంద్రంలో ప్రవేశ పరీక్షకు సన్నద్ధం అవుతున్న బీహార్‌కు చెందిన అమన్ కుమార్ సింగ్ ఈ నెల 11 అర్ధరాత్రి స్వర్ణ్ విహార్ కాలనీలోని తన పేయింగ్ గెస్ట్ (పిజి) గదిలో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నీట్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయానని, ఉత్తీర్ణుడను కాలేకపోవచ్చునని పేర్కొంటూ సింగ్ ఒక లేఖ వదిలినట్లు వారు తెలిపారు.

చంబల్ నదిపై గల కోటా బ్యారేజ్ సమీపంలో తన కోసం చూడవలసిందని పాఠకులను సింగ్ ఆ లేఖలో కోరాడని పోలీసులు తెలిపారు. అయితే, బ్యారేజ్ సమీపాన అతని ఆచూకీ లభించనందున అతను ఆత్మహత్యచేసుకునే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సింగ్ మరొక బాలునితో ఒక బైక్‌పై ఎక్కి కోటా రైల్వే స్టేషన్ చేరినట్లు వెల్లడైందని, అక్కడ అతను ఒక రైలు ఎక్కాడని డిఎస్‌పి రాజేష్ సోని వివరించారు. పోలీసులను, తన తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు సింగ్ తన గదిలో ఆ లేఖ వదలి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. సింగ్ ఆచూకీ త్వరలోనే కనుగొనగలమని డిఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News