- Advertisement -
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ భవనం పై నుంచి పడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. నగరంలో బైపాస్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కు చెందిన సాయి శరణ్య అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కింద పడింది. పదవ తరగతి చదువుతున్న సాయి శరణ్య విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదవశాత్తు కాలుజారీ క్రింద పడిందా లేక ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ ఘటనలో విద్యార్థిని మెకాళ్ళకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -