Thursday, December 19, 2024

గురుకుల పాఠశాలలో దారుణం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వంటవాళ్లకు బదులుగా విద్యార్థులను వంటపనికి వినియోగించడంతో 8వ తరగతి విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా, సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులను వంటపనికి వినియోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News