Friday, December 27, 2024

వారం క్రితమే ఆ కళాశాలలో చేరింది.. అంతలోనే విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బాచుపల్లి నారాయణ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని వంశికగా గుర్తించారు. విద్యార్థిని వారం క్రితమే నారాయణ కళాశాలలో చేరినట్లు సమాచారం.

తోటి విధ్యార్థుల సమాచారం మేరకు ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ప్రస్తుతం విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News