Sunday, March 30, 2025

తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న కాలేజ్ తొమ్మిదవ అంతస్థు నుంచి 18 ఏళ్ల బికామ్ విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆ విద్యార్థి పేరు పార్థ్ రావత్. అతడు మహారాజ అగ్రసేన్ కాలేజ్‌లో బికామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రావత్ సోమవారం కాలేజ్ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకాడు.

పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అది ఆత్మహత్య అని తేలింది. ఏదిఏమైనప్పటికీ పోలీసులు అసలు కారణం ఏమై ఉంటుందా అని పరిశోధిస్తున్నారు. పోలీసు అధికారులు సిసిటివి ఫుటేజ్ పరిశీలించడమేకాక, అక్కడ అప్పుడున్న విద్యార్థులు, సిబ్బందిని ప్రశ్నించారు. కాగా ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News