Saturday, February 22, 2025

పరీక్షలో చీటింగ్.. తుపాకులతో ఫైరింగ్.. విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

రోహ్‌తాస్: 10వ తరగతి పరీక్షల్లో చీటింగ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలు ఓ విద్యార్థి ప్రాణాలు తీశాయి. రోహ్‌తాస్ జిల్లా సాసారామ్ దెహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల్లో చీట్ చేశారంటూ రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం దాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు తుపాకులతో కాల్పులు జరపాగా.. ముగ్గురు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఇందులో ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గురువారం సాయంత్రం విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కొంత సమయంలోనే హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో తుపాకులతో కొందరు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అమిత్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తుండగా శుక్రవారం అమిత్ ప్రాణాలు వదిలాడు. దీంతో అతని కుటుంబసభ్యులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ హైవేపై ధర్నాకు దిగారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు వారికి హామీ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఈ కేసుకు సంబంధించి సుమిత్ కుమార్ అనే విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు ఎస్పి రోషన్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News