Monday, December 23, 2024

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాంనుంత్ల మాజీ సర్పంచ్ శ్వేతా ఆనంద్ దంపతులు పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు శ్రీనిధి (16) ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలో ఇంటర్ చదువు కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించగా

హాస్టల్లో ఉండడం ఇష్టంలేని శ్రీనిధి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల రోదనలు అందరిని కలచివేసాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News