Tuesday, November 5, 2024

నీట్ భారంతో మరో టీనేజర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోటా (రాజస్థాన్) : చిన్ననాటనే తట్టుకోలేని పోటీ పరీక్షల విద్యారంగం మరో విద్యార్థిని బలిగొంది. రాజస్థాన్‌లోని కోటాలో ఆదివారం మహారాష్ట్రకు చెందిన 16 ఏండ్ల కుర్రాడు తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ జాతీయ పరీక్షకు సిద్ధం అయ్యేందుకు ఈ విద్యార్థి ఇక్కడికి వచ్చాడు. పరీక్షలు, మానసిక పరిస్థితి నడుమ ఒత్తిడిని తట్టుకోలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి దిగినట్లు నిర్థారణ అయింది. ఈ ఒక్కనెలలోనే ఈ విధంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల్కనీల్లో యాంటి సూసైడ్ నెట్స్, హాస్టల్ రూంల్లో ప్రత్యేకమైన స్ప్రింగ్ ఫ్యాన్లు వంటి ఏర్పాట్లు చేస్తూ అధికారులు విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఈ దశలోనే ఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనితో ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ విధంగా 20 మంది వరకూ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటాలో పోటీ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వందలాదిగా కోచింగ్ సెంటర్లు, వీటికి అనుబంధంగా హాస్టళ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుంటారు. స్ప్రింగ్ ఫ్యాన్లతో , ఇతరత్రా ఏర్పాట్లతో ఆత్మహత్యల నివారణ చర్యలు ఏ మూలకు పనికొస్తాయని, ముందుగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించాల్సి ఉందని విద్యానిపుణులు, సామాజిక వేత్తలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News