Sunday, December 22, 2024

తరగతి గదిలో చాకులతో పొడుచుకున్న విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజావరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం కలకలం రేగింది. విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పోడిచాడు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

ఉపాధ్యాయుల సమక్షంలో పరీక్ష కేంద్రంలోనే ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News