Friday, January 24, 2025

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి విజయవంతం

- Advertisement -
- Advertisement -

నీట్ సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి చొరవ చూపాలి
నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి

విద్యార్థి, యువజన సంఘ నేతల అక్రమ అరెస్ట్, నల్లకుంట ఠాణాకు తరలింపు

విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త డిమాండ్

హైదరాబాద్: నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు భవితవ్యంపై నోరు మెదపని కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త డిమాండ్ చేశారు. నీట్ యూజీసీ పరీక్షా అంశంపై స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిన్న కిషన్ రెడ్డి ని అపాయింట్మెంట్ కోరారు. కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో నేడు సంఘాల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో సంఘాల నేతలు, విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్రమంగా వారిని అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ, లక్షలాదిమంది విద్యార్థులు అంశంపై లేకపోవడం సిగ్గు చేటు అని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి మోడీని అడగాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News