Friday, November 22, 2024

కరోనాతో విద్యార్థులు నష్టపోయారు: సబిత

- Advertisement -
- Advertisement -

అవార్డ్ అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురుపూజోత్సవం శుభాకాంక్షలు

హైదరాబాద్: విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రవీంద్రభారతి లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో సబిత మాట్లాడారు. కరోనా సమయంలో కూడా డిజిటల్ క్లాస్ ల నిర్వహణ, ఆన్లైన్ క్లాస్ లు చెప్పిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. విద్య బోధన కోసం అనేక ప్రయత్నాలను చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని, కరోనాతో విద్యార్థులు నష్టపోయారని క్లాస్ ల గ్యాప్ వచ్చిందన్నారు.  విద్యార్థులకు క్లాస్ గ్యాప్ ను ఉపాధ్యాయులే తొలగించాలని సూచించారు. 650 గురుకుల పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించామని, స్కూల్ డే ను ఈ ఏడాది జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కుటుంబ ప్రభావం విద్యార్థులపై పడకుండా, భవిష్యత్త్ పై వారికి ఆశలు కల్పించే విధంగా విద్యార్థులను తీర్చి దిద్దాలని సూచించారు. అదనంగా 4000 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, స్కూల్స్, కాలేజీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించు కోవడానికి ఈ నిధులను ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. పిల్లల్లో మానవతా, మానవీయ, నైతిక విలువలు పెంపొందించాలని, డ్రాపౌట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News