Wednesday, January 22, 2025

కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లోని కోటాలో రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యువరాజ్ అనే విద్యార్థి అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. జేఈఈ విద్యార్థి రచిత్ అదృశ్యం అయిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం యువరాజ్ నీట్ మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. కోటా లోని ట్రాన్స్‌పోర్టు నగర లోని హాస్టల్ లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరు కాడానికి బయటకు వెళ్లి మరి తిరిగిరాలేదు. అతను తన మొబైల్ ఫోన్‌ను కూడా హాస్టల్ లోనే విడిచిపెట్టాడు. వారం రోజుల క్రితం అదృశ్యమైన రచిత్ కోటా లోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపం లోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీస్‌లు గాలింపు చేపట్టారు. ప్రత్యేకంగా ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగం లోకి దింపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News