Monday, December 23, 2024

ముంబై లోకల్ ట్రైన్‌లో విద్యార్థినిపై రైల్వే కూలీ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై లోకల్ రైలులో ఒక 20 ఏళ్ల విద్యార్థినిపై రైల్వే కూలీ ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నవీ ముంబైకు లోకల్ రైలులో వెళుతున్న ఆ విద్యార్థినిపై రైల్వే కూలీ అత్యాచారానిక పాల్పడ్డాడు. సహ ప్రయాణికురాలి సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సెంట్రల్ రైల్వేలోని హార్బర్ లేన్‌కు చెందిన సిఎస్‌ఎంటి-పాన్వెల్ రైలు బుధవారం ఉదయం 7.27కు బయల్దేరింది. మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన పర్వేజ్ కరీం(40) అనే రైల్వే కూలీ ఒంటరిగా ఉన్న ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సిసిటివి కెమెరాల సాయంతో నిందిఉతడిని జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌కు చెందిన ఉమ్మడి బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News