Sunday, December 22, 2024

మర్డర్ చేస్తే స్కూల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని…

- Advertisement -
- Advertisement -

Student murder by 10th Class student

లక్నో: పదో తరగతి విద్యార్థి మరో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్‌కుమార్ అనే విద్యార్థి ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతడి ఇంటి పక్కనే మరో విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరు కలిసి మెలిసి ఉండేవాళ్లు. ఆడుకుందామని బయటకు తీసుకెళ్లి నీరజ్ గొంతును పదో తరగతి విద్యార్థి కోశాడు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో తాను హత్య చేశానని జైలుకు పంపాలని, స్కూల్‌కు వద్దని వారించాడు. బాలుడి ప్రవర్తనతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నీరజ్ మృతదేహాన్ని చూసి పోలీసులు ఉలిక్కిపడ్డారు. పదో తరగతి బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. తనకు చదువు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పాఠశాలకు పంపుతున్నారని తెలిపారు. మర్డర్ చేస్తే జైలులో ఉండొచ్చని బాలుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News