పోటీదారులందరి కన్నా అతి చిన్న వయస్కురాలిగా రికార్డు
లండన్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐరోపా బాలికల మేథమెటికల్ ఒలింపియాడ్ పోటీ (ఇజిఎంఒ) కి భారత సంతతికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆన్యగోయల్ ఎంపికైంది. పోటీకి ఎంపికైన విద్యార్థుల్లో ఈమె అతిపిన్న వయస్సురాలు. వచ్చేనెల తూర్పు ఐరోపా దేశం జార్జియాలో ఈ పోటీలు జరుగుతాయి. దక్షిణ లండన్ డల్విచ్ స్కూలు విద్యార్థిని అయిన ఆన్యగోయల్ గత ఏడాది లాక్‌డౌన్ కాలాన్ని మేథమెటికల్ ప్రాబ్లమ్ పర్కిరించడంలో తనకు తాను కృషి చేయగలిగింది. ఆమెకు మేథ్స్ కోచ్‌గా మాజీ మేథ్ ఒలింపియన్ అయిన ఆమె తండ్రి అమిత్ గోయల్ వ్యవహరించారు.
ఇజిఎంఒ కు బ్రిటిష్ టీమ్‌లో ఎంపిక కాడానికి యుకె మేథమెటిక్స్ ట్రస్ట్ (యుకెఎంటి) నిర్వహించిన ఎగ్జామ్స్ సీరీస్‌పై దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేసింది. ఏటా యుకెఎంటి పరీక్షలకు బ్రిటన్ మొత్తం మీద దాదాపు ఆరు లక్షల మంది సెకండరీ స్కూలు విద్యార్థులు హాజరవుతుంటారు. వీరిలో టాప్ 1000 మందినే ఇజిఎంఒకు ఎంపిక చేస్తుంటారు. వీరిలో టాప్ 100 మంది మాత్రమే రెండో రౌండ్ పరీక్షకు ఎంపికవుతారు. ఆన్య టాప్ నలుగురు బాలికల్లో గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటివరకు 15 ఏళ్ల వారే ఈ పరీక్షకు ఎంపిక కాగా ఆన్య మాత్రం 13 ఏళ్ల వయసుతో వారందరి కన్నా చిన్నదానిగా రికార్డు సాధించింది.