Thursday, December 19, 2024

ప్రిన్సిపాల్ వేధింపులు.. గురుకుల బాలికల ధర్నా

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డిపేట ః దుమాల ఏకలవ్య గిరిజన గురుకులంలో సిబ్బంది అవినీతి వేధింపులను నిరసిస్తూ ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో బాలికలు కరీంనగర్- కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సిబ్బంది అవినీతిపై గంటపాటు ఎకరువు పెట్టారు. మానసిక వ్యధకు గురైన విద్యార్థినులు చీకటిపూట పాఠశాల గేట్ దాటి ఎముకలు కొరుకుతున్న చలిని సైతం లెక్క చేయకుండ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన రమదారిపై ఉదయం 6 గంటలకు ఆందోళన చేపట్టారు. ఒంటరిగా ఆడ పిల్లలు పాఠశాల వదలి బయటకు రావడం పలు విమర్శలకు దారి తీసింది. ఏబీవీపీ రాష్ట్ర హస్టల్ల కన్వీనర్ రంజిత్ సంఘీభావం తెలిపి గురుకులాల పర్యవేక్షణపై ప్రత్యేక కమిటి వేయాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ కాస్మోటిక్ నిధులను దుర్వినియోగం చేసి చాలి చాలని మౌత్ బ్రష్‌లు, సోంపులు, పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్లితే తమనే విమర్శలకు గురి చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేసారు. వాచ్‌మేన్ రామ స్వామి మద్యం సేవించి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వార్డెన్ రమ్య కావాలని సదుద్దేశంతో పురుగుల అన్నం, చారు వడ్డిస్తున్నట్లు చెప్పారు. అన్నం, కూరలలో వానపాములు ఉంటున్నాయని వెల్లడించారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేసారు. కిచెన్ మాస్టర్ భద్రమ్మ వేదింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎవరికి వారే అన్న చందాన అవినీతి, వేదింపులు జరుగుతున్న పాఠశాలలో చదువులు కొన సాగించలేమని ఆందోళన చెందారు.

వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసారు. సంఘటన స్థలానికి చేరుకున్న మండల వైస్ ప్రసిడెంట్ కదిర భాస్కర్ గౌడ్, ఎస్‌ఐ శేఖర్ బాలికలకు నచ్చ చెప్పి ధర్నా విరమింప చేసారు. బిఅర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,జడ్పీటిసి లక్ష్మన్ రావు, ఎంపిపి రేణుక కిషన్, స్థానిక సర్పంచ్ రజిత శ్రీనివాస్ గౌడ్, అధికారులు గురుకుల విద్యాలయాన్ని సందర్శించి వసతులపై ఆరాతీసారు. వేధింపుల పట్ల సిబ్బందిని మందలించారు. ఈలాంటి సమస్యలు చోటు చేసుకోకుండ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌తో సంప్రదించి అధికారులను అప్రమత్తం చేయగలమని బాలికలకు బరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News