Sunday, January 19, 2025

సదాశివపేట డిగ్రీ కాలేజీలో విద్యార్థుల నిరసన

- Advertisement -
- Advertisement -

సదాశివపేట: డిగ్రీ విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా సమయం కంటే సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇన్విజిలేటర్‌లు సమయమున్న గంట ముందుగానే విద్యార్థుల నుండి పేపర్‌లు లాక్కోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉండడంతో సదాశివపేటలోని పద్మనాభ డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి పరీక్ష కేంద్రంలోకి వచ్చారు. ప్రశ్న పత్రంపై పరీక్షకు 3గంటల సమయం ఉందని ఉండగా ఇన్జిలేటర్‌లు కేవలం పద్మానాభ డిగ్రీ కాలేజీ విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిబ్బంది ఇన్విజిలేటర్‌లు తప్పుదోవ పట్టించి 2గంటలలోపు జవాబు పత్రాలను తీసుకున్నారు.

దీంతో విద్యార్థులు ఇన్విజిలేటర్‌లతో 3గంటల సమయమున్న ఇలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తమ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సమాచారం చేరవేయడంతో పద్మనాభ డిగ్రీ కాలేజీ ప్రన్సిపాల్ వచ్చి ఇన్విజిలేటర్‌లను ప్రశ్నించగా ఇన్విజిలేటర్‌లు సమాధానం దాట వేశారు. విద్యార్థులు తాము సరిగా పరీక్ష రాయలేదని త మను పరీక్ష రాయకుండా చేసిన ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీ సుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News