Monday, January 6, 2025

విద్యార్థుల బహిరంగ ముద్దులు..కాలేజీ నుంచి సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకున్న ఇద్దరు విద్యార్థులను సంబందిత కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఉదంతం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. ఇద్దరు విద్యార్థులలో బాలిలుడు ముస్లిం కావడం, బాలిక హిందువు కావడంతో ఈ సంఘటన మతం రంగు పులుముకుంది. సోషల్ మీడియాలో ఈ సంఘటనపై విస్తృతంగా చర్చ జరిగింది. ఇది లవ్ జిహాద్ అని ఆరోపించిన హిందూ కార్యకర్తలు ఆ బాలుడిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

హిందూ బాలికతో అలా బహిరంగంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారం మతం రంగు పులుముకోవడంతో ఆ విద్యార్థులు చదువుకుంటున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యం బెల్తన్‌గడి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది. విద్యార్థుల గురించి ఆన్‌లైన్ ప్రచారం సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం తన ఫిర్యాదులో పోలీసులను కోరింది. ఈ సంఘటన తమ దృష్టికి రాగానే ఆ ఇద్దరు విద్యార్థులను కలశాల నుంచి సస్పెండ్ చేశామని యాజమాన్యం తెలిపింది. అయితే&హిందూ బాలికను మాత్రమే కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసిందని, ముస్లిం బాలుడిపై ఎటువంటి చర్య తతీసుకోలేదని హిందూ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News