Monday, December 23, 2024

అమెరికాలో తెలుగు వాడి సత్తా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి నిజం చేస్తూ.. తన ప్రసంగాలతో 12 ఏళ్ల బాలుడు అదరగొడుతున్నారు. న్యూజెర్సీలో సోమర్‌సెట్‌లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న సాహిత్ మంగు ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా గార్డెన్ స్టేట్ డిబెట్ లీగ్ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది ఈ నెల 4న వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్ మంగు గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు.

12 ఏళ్ల ఈ కుర్రాడి టాపిక్‌లు, డిబేటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌పై చేసిన అసాధారణ పరిశోధనలకు న్యాయ నిర్ణేతలు, ఉపాధ్యాయులు, తొటి స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అతినిది హైదరాబాదీ కుటుంబం. అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన ఇండో అమెరికన్ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్ మంగు తన ప్రసంగాలతో అదరగొడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుత అవార్డుతో పాటు, పాఠశాలలో పాటలు పాడటం, డిబేట్‌లో పాల్గొనటంతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News